ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.
రైల్వే జోన్ గురించి ఎవరూ మాట్లాడరన్న ఆయన భావనపాడు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు గురించి మాట్లాడరా అని ప్రశ్నించారు.స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
విశాఖలో వైసీపీ నేతల భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు.జగనన్న భూ హక్కు అంటున్నారు… జగనన్న భూములు పంచుతున్నారా అని అడిగారు.
జగనన్న కాలనీ అనేదే పెద్ద స్కాం అంటూ ఆరోపణలు చేశారు.