కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు సుధాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.తన జీవితంలో ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని అనుకోలేదని వాపోయారు.
తనతో పాటు తన కుమారుడు చెరుకు సుహాస్ ను తిట్టిన తీరు కన్నతల్లిని అవమానించడమేనని చెరుకు సుధాకర్ వ్యాఖ్యనించారు.ఈ కామెంట్స్ పై క్షమాపణ చెప్పడం కాదన్న ఆయన కోమటిరెడ్డి తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు.