పల్నాడుజిల్లా, చిలకలూరిపేట: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలనలో రాష్ట్రంలో ప్రతి ఇంట సంక్షేమ వెలుగులు విరాచిమ్ముతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు.పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 38 వ వార్డు వైయస్సార్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నాడు నిర్వహించారు.
మంత్రి రజిని మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఈ మూడేళ్లలో ఒక కుటుంబానికి ప్రతిఏటా మూడు నుంచి ఐదు పథకాలు అందుతున్నాయని లబ్ధిదారులు తమకు చెబుతున్నారు అని తెలిపారు.ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు,ఇంకా అందాల్సిన పథకాల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
ప్రతి గడప కు వెళ్ళినప్పుడు సంబంధిత వాలంటీర్, రెవెన్యూ అధికారులు,సచివాలయ సిబ్బంది మంత్రికి ఆ కుటుంబ సభ్యులకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.ప్రతి ఇంటికి కూడా ముఖ్యమంత్రి దిగ్విజయంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు చేరాయని, ముఖ్యంగా అమ్మ ఒడి,ప్రతి నెలా పింఛన్,పేదలందరికీ ఇల్లు,రైతు భరోసా,వాహన మిత్ర,జగనన్న చేదోడు, వైయస్సార్ ఆసరా వంటి పథకాల ప్రయోజనం పొందినట్లు లబ్ధిదారులు తెలిపారన్నారు.
అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలంతా కృతజ్ఞతలు తెలిపారన్నారు.ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వ ప్రయోజనం పొందిన లబ్ధిదారులను పలకరించడం, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం మనసుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇంకా ఎవరైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు లభించని వారికి కూడా ప్రభుత్వ ప్రయోజనాన్ని అందించాలనే లక్ష్యంతో,వారి సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు.