విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 34వార్డ్ కొబ్బరితోట ఏరియాలో మనోరమ థియేటర్ దగ్గరలో ₹.1.16కోట్ల వ్యయంతో మరియు 38వార్డ్ SKML టెంపుల్, బురుజుపేట ఏరియాలో ₹.1.04కోట్ల వ్యయం తో మొత్తం ₹.2.20కోట్లతో నిర్మించిన రెండు వైస్సార్ అర్బన్ క్లినిక్స్ ను ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ చార్జి మంత్రి వర్యులు విడదల రజిని గారు గురువారం ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల్లో భాగంగా వీటి నిర్మాణం జరిగిందన్నారు.
కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారు, జీవీఎంసీ 34వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి తోట పద్మావతి, జీవీఎంసీ కార్పొరేటర్లు, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, DMHO, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.