గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బస్తీ దవాఖానా ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి..

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ గా మార్చాలనే పట్టుదలతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవంతో పాటు సుమారు 75 లక్షలతో వీధి దీపాలను ప్రారంభించారు.

 Minister Mallareddy Inaugurated Basthi Dawakhana At Gundlapochampalli Municipali-TeluguStop.com

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అన్ని కాలనీలో వీది దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఆరోఆరోగ్య తెలంగాణగ మార్చేందుకు బడ్జెట్ లో 10వేల కోట్లను పెట్టడం జరిగిందన్నారు.

4వేల కోట్లతో వెయ్యి బెడ్లతో కూడిన 4 ఆసుపత్రులకు భీమిపూజ చేసుకోవడం జరిగిందన్నారు.మేడ్చల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుందని తెలిపారు.ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీనివాస్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రభాకర్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube