వైసీపీ ప్రభుత్వం “విశాఖ గర్జన” కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈనెల 15వ తారీకు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా పోస్టర్ నీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, జెఏసి నాయకులు విడుదల చేయడం జరిగింది.
పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని మంత్రి అమర్నాథ్ తెలిపారు.అంతేకాదు అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖకు రావడానికి కూడా సిద్ధమైనట్లు స్పష్టం చేశారు.
మూడు రాజధానులకు సంబంధించి మద్దతుగా విశాఖలో ఈనెల 15వ తారీకు వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైసీపీ అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంది.ఇంకా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “జనవాని” కార్యక్రమం నిర్వహించడం పట్ల వైసిపి నాయకులు మండిపడుతున్నారు.“విశాఖ గర్జన” కార్యక్రమాన్ని డైవర్షన్ చేయడానికే అంటూ వైసీపీ నాయకులు సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.