బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తెలంగాణలో బీజేపీ దుష్ట సంస్కృతికి తెర తీసిందన్నారు.
అన్ని వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.దేశంలో మోదీ రాజ్యాంగం అమలు అవుతోందని మండిపడ్డారు.
వ్యవస్థలను అడ్డుపెట్టుకుని శిఖండి రాజకీయం చేస్తోందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఉన్మాద రాజకీయాలను ధీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందో చెప్పి ఓట్లు అడగాలని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు.
ధన బలంతో మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలవాలని చూస్తోందని విమర్శించారు.కూసుకుంట్లను గెలిపిస్తారని నమ్మకం ఉందన్న కేటీఆర్ ఈ ఉపఎన్నిక తెలంగాణ భవితవ్యంపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు.
మునుగోడుకు బీజేపీ, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.