ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్( Congress ) అధికారంలో ఉన్న సమయంలో వట్టి వసంత కుమార్( Vatti Vasantha Kumar ) కీలకంగా రాణించారు.గత ఏడాది ఆయన తుది శ్వాస విడిచారు.
ఈ క్రమంలో ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో అప్పట్లో వట్టి వసంత కుమార్ తో ఉన్న సమకాలిక రాజకీయ నేతలు పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు కూడా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ… వట్టి వసంత కుమార్ వైయస్ రాజశేఖర్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉండేవారని అన్నారు.
వసంత కుమార్ అంటే వైయస్ కూడా చాలా ప్రత్యేకంగా చూసేవారు.ఎవరైనా సహాయం అడిగితే తన పరిధిలో ఉన్నంతవరకు సహాయం చేసే వారిలో వట్టి వసంత్ చాలా అరుదైన మనిషి.ఆయన అధిరోహించిన పదవులకు వన్నె తీసుకొచ్చే నాయకుడు.
ప్రస్తుత రాజకీయాల్లో పదవి వచ్చాక నేతల స్వభావం మారిపోతుంది.వసంత కుమార్ అవినీతికి తావు లేకుండా పరిపాలన అందించిన వ్యక్తి.
ఈ క్రమంలో అటువంటి మహనీయుడు ప్రథమ వర్ధంతికి తనని ఆహ్వానించిన వట్టి రమేష్ కి ధన్యవాదాలు అని మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu )వ్యాఖ్యానించారు.పూళ్ల శివారు ఎంఎంపురంలో శనివారం స్వర్గీయ మాజీ మంత్రి వసంత కుమార్ ప్రథమ వర్థంతి జరిగింది.
వసంత కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.