దంగల్ సినిమా( Dangal ) మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా కేవలం 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 2000 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
ఈ సినిమాకు అమీర్ ఖాన్( Aamir Khan ) హీరోగా మాత్రమే కాదు కో ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు.చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చి నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు.
ఈ సినిమా ఇండియా సినిమాలు విడుదలయ్యే ప్రతి దేశంలో కూడా విడుదల చేయబడి కనక వర్షాన్ని కురిపించింది.అంతటి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పాకిస్తాన్ లో మాత్రం విడుదల చేయలేదట.
పైగా దానికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా సిద్ధపడ్డారట.ఇంతకీ ఎందుకు పాకిస్తాన్ లో ఈ సినిమా విడుదల కాలేదు ? అలా కోట్ల నష్టం ఎందుకు వచ్చింది ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దంగల్ సినిమా విడుదలైన తర్వాత రకరకాల దేశాల నుంచి ఈ సినిమాను విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారట.దాంతో అనేక దేశాల్లో చిత్రాన్ని విడుదల చేసి మేకర్స్ బాగానే సంపాదించుకున్నారు.అయితే పాకిస్థాన్ లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు.దానికి చాలా రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆ దేశానికి సినిమాను పంపించారు.కానీ అక్కడ సెన్సార్ వారు ఈ సినిమా క్లైమాక్స్ లో గీత గెలిచినప్పుడు వచ్చే భారతదేశపు జాతీయ గీతాన్ని కట్ చేస్తే తప్ప విడుదల చేయడానికి క్లీన్ సిగ్నల్ ఇవ్వమని చెప్పారట.దానికోసం అప్పటికే 12 కోట్లు ఖర్చుపెట్టిన అమీర్ ఖాన్ మరియు అతని నిర్మాతలు 12 కోట్లు పోయిన పర్వాలేదు.
కానీ సినిమా నుంచి జాతీయ గీతాన్ని తీసే ప్రసక్తే లేదు అంటూ చెప్పారట.
అలా మొత్తంగా కోట్ల రూపాయలు పోయినా సరే దేశం మీద ఉన్న గౌరవంతో జాతీయ గీతాన్ని తన సినిమా నుంచి తీయడానికి ఒప్పుకోలేదు అమీర్ ఖాన్ మరియు ప్రొడ్యూసర్స్.ఒకవేళ కనుక పాకిస్తాన్ ( Pakistan )లో కూడా విడుదలై ఉండి ఉంటే దాదాపు 50 నుంచి 100 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది.కానీ డబ్బుల కన్నా కూడా దేశమే ముఖ్యం అని మరోసారి ఆమీర్ ఖాన్ నిరూపించారు.
ఇంత అరుదైన నటులు ఇండియాలోనే మరొకరు ఉండడం చాలా కష్టం.