టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా భారీగా విజయాలను సొంతం చేసుకోని హీరోయిన్లలో మెహరీన్( Mehreen ) ఒకరు.మెహరీన్ నటించిన స్పార్క్ లైఫ్ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెహరీన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.స్పార్క్ సినిమాలో నేను లేఖ అనే పాత్రలో కనిపిస్తానని ఆమె తెలిపారు.
లేఖ పాత్ర ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర అని ఆమె చెప్పుకొచ్చారు.సినిమా నాతోనే మొదలవుతుందని నాతోనే పూర్తవుతుందని మెహరీన్ తెలిపారు.ఇలాంటి థ్రిల్లర్ సినిమాలో నటించడం నాకు కూడా కొత్తగా అనిపించిందని మెహరీన్ కామెంట్లు చేశారు.నా సినిమా ప్రమోషన్లలో ఎవరైనా నా క్యారెక్టర్ పేరుతో నన్ను పిలిస్తే సంతోషంగా ఉంటుందని ఆమె అన్నారు.
అదే నాకు స్పార్క్ మూమెంట్ గా నేను భావిస్తానని మెహరీన్ తెలిపారు.నిన్న మొన్నటివరకు నన్ను హనీ, మహాలక్ష్మి లాంటి అని పిలిచారని ఇకపై నన్ను లేఖ అని పిలుస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
స్పార్క్ లైఫ్ సినిమాపై మెహ్రీన్ చాలా ఆశలు పెట్టుకోగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.విక్రాంత్ ఈ సినిమాలో హీరోగా నటించగా ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
మెహ్రీన్ కు ఈ సినిమాతో పూర్వ వైభవం వస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
పేరున్న నటీనటులు ఈ సినిమాలో నటించారు.ఈ ట్రైలర్ కు 9.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.ఈ మూవీ విజయం సాధిస్తే మెహరీన్ మరిన్ని ఆఫర్లను అందుకుంటారని చెప్పవచ్చు. మెహరీన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.