గాడ్‌ ఫాదర్‌ హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ కి నిరాశేనా...?

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.సినిమా విడుదల నేపథ్యం లో అనంతపురం లో భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసింది.

 Megastar Chiranjeevi God Father Movie Event In Dubai , Film News, Godfather, Mov-TeluguStop.com

భారీ వర్షంలో కూడా మెగా అభిమానులు వేలాది మంది తరలి వచ్చి మెగాస్టార్ చిరంజీవి యొక్క స్పీచ్ విన్నారు.ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే హైదరాబాదు లో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లుగా నిన్నటి వరకు సమాచారం జరిగింది.

కానీ తాజాగా వినిపిస్తున్న వార్తలను అనుసారం హైదరాబాదు లో ఈవెంట్ లేదని సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథి గా దుబాయి లో ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌ లో ఈవెంట్‌ ఉంటుందని ఎదురు చూసిన మెగా అభిమానులకు నిరాశే మిగిలినట్లయ్యింది.

ముంబై లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నప్పటికీ సల్మాన్ ఖాన్ యొక్క భద్రత కారణాల దృష్ట్యా దుబాయి లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని, ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయమై అధికారికంగా ప్రకటన వస్తుందని తెలుస్తుంది.దుబాయి లో నిర్వహించబోతున్న ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ తో పాటు ఇంకా చిత్రం లో నటించిన పలువురు నటీనటులు కూడా హాజరవ్వబోతున్నారు.ప్రత్యేక విమానం లో ముంబై నుండి చిత్ర యూనిట్ సభ్యులందరూ దుబాయ్ కి చేరుకుంటారట.

ఈ సినిమా లో నయనతార కీలక పాత్రలో నటించింది, ఆమె ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవుతుందని అంతా భావించారు.కానీ ఎప్పటిలాగే ఆమె ఈ సారి కూడా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube