ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో దాఖలైన నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు.ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో పత్రాలను పరిశీలించనున్నారు.
చెల్లుబాటు అయ్యే వాటిని గుర్తించి, అభ్యర్థుల పేర్లను సాయంత్రం ప్రకటించనున్నారు.నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8వ తేదీ వరకు గడువు ఉంది.ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 17న జరగనుండగా.19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.అయితే, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నో ఉత్కంఠల నడుమ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది.సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ లతో పాటు మరో సీనియర్ నేత, జార్ఖాండ్ మాజీమంత్రి కెఎన్ త్రిపాఠి కూడా నామినేషన్ వేశారు.
అయితే, శశిథరూర్, మల్లికార్జున ఖర్గేల మధ్య పోటీ నెలకొంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.దీనిపై సాయంత్రానికి క్లారిటీ రానుంది.