చిరు, పవన్, బన్నీ, చరణ్ తర్వాత ఆ రేంజ్ మెగా హీరో లేనట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.మెగా హీరోలలో ఒకరైన చిరంజీవి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 Mega Family Heroes Are In Big Trouble Details Here Goes Viral ,mega Family,mega-TeluguStop.com

చిరంజీవితో సినిమాలను నిర్మించిన నిర్మాతలలో ఎక్కువమంది నిర్మాతలు ఆర్థికంగా స్థిరపడ్డారు.ఈ జనరేషన్ డైరెక్టర్లలో కూడా చాలామందికి చిరంజీవి సినిమాకు డైరెక్షన్ చేయడం కల అనే సంగతి తెలిసిందే.

చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తర్వాత నాగబాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా హీరోగా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

అయితే నాగబాబు హీరోగా సక్సెస్ కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యారు.

చిరంజీవి మరో తమ్ముడు పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.పవన్ కళ్యాణ్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.

పవన్ సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ కావాల్సిందే అనే సంగతి తెలిసిందే.ఆ తర్వాత అల్లు అర్జున్ మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Telugu Allu Arjun, Allu, Big Troubles, Chiranjeevi, Heroes, Pawan Kalyan, Ram Ch

అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీకి చెందిన హీరో అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం మెగా హీరోగానే భావించారు.ఆ తర్వాత చిరంజీవి వారసుడు రామ్ చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.చరణ్ కూడా స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నారు.అయితే చిరంజీవి, పవన్, చరణ్, బన్నీ తర్వాత పలువురు మెగా హీరోలు సినిమాల్లోకి వచ్చినా ఈ హీరోలు స్టార్ డమ్ ను సొంతం చేసుకోలేకపోయారు.

ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు ఈ హీరోల ఖాతాలో ఉన్నా వరుసగా విజయాలను సొంతం చేసుకోలేకపోవడం, ఒక సినిమా హిట్టైతే తర్వాత సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం ఈ హీరోల కెరీర్ కు మైనస్ గా మారింది.చిరంజీవి, పవన్, బన్నీ, చరణ్ మాత్రమే జయాపజయాలతో సంబంధం లేకుండా సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తున్నారు.

ఈ హీరోల రేంజ్ లో మరో మెగా హీరో ఎవరైనా సక్సెస్ అవుతారో లేదో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube