టైమ్ 2024లో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా చోటు.. ఎవరీ ప్రియంవదా నటరాజన్..?

సైద్థాంతిక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రియంవద నటరాజన్( Astronomy and Physics Scientist Priyamvada Natarajan) బుధవారం ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2024 సంవత్సరానికి గాను 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.ఈ జాబితా ప్రతి యేటా ప్రచురించబడుతుంది.

 Meet Priyamvada Natarajan Indian Yale Professor On Time 2024 List Of 100 Most-TeluguStop.com

ప్రపంచస్థాయి నాయకులు, వ్యాపార, క్రీడా, మీడియా స్టార్లు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త షెప్ డోలెమాన్.

టైమ్ కథనం( Time Magazine )లో నటరాజన్ గురించి ఇలా రాశారు.ప్రియంవదకు అత్యంత సృజనాత్మక పరిశోధనలు చేయడంలో నైపుణ్యం వుందన్నారు.

గతేడాది నవంబర్‌లో .నటరాజన్ అభివృద్ధి చేసిన ఒక నవల ఖగోళ శాస్త్రంలో ఒక ప్రాథమిక రహస్యాన్ని అర్ధం చేసుకోవడానికి వీలు కల్పించిందని డోలెమాన్ ప్రశంసించారు.చాలా గెలాక్సీల కేంద్రాలలో దాగి వున్న సూపర్ మాసివ్ బ్లాక్స్ ఎలా ఎర్పడతాయో ప్రియంవద వివరించారని పేర్కొన్నారు.

Telugu Indianyale, Influential, Time-Telugu NRI

ప్రియంవద నటరాజన్ యేల్ యూనివర్సిటీ( Yale University )లో ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్ర విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్, కృష్ణ పదార్థానికి ప్రాధాన్యతనిస్తూ విశ్వోద్భవ శాస్త్రంలో పనిచేస్తున్నారు.నటరాజన్‌కి 2008లో రాడ్‌క్లిఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమెలైన్ కాన్లాండ్ బిగెలో ఫెలోషిప్ లభించింది.ఆమె అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( Massachusetts Institute of Technology )లో చరిత్ర, తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ కూడా చేసినట్లు టైమ్ మ్యాగజైన్ తెలిపింది.

అనంతరం సైద్ధాంతిక ఖగోళ భౌతిక శాస్త్రంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.తర్వాత కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో టైటిల్ ఏ కింద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు ఎన్నికైంది.

నటరాజన్ 2006 – 2007లో యేల్‌లోని విట్నీ హ్యుమానిటీస్ సెంటర్‌లోనూ పనిచేశారు.

Telugu Indianyale, Influential, Time-Telugu NRI

campuspress.yale.edu వెబ్‌సైట్ ప్రకారం. ప్రియంవదకు ఎన్నో సత్కరాలు, గౌరవాలు లభించాయి.అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, అమెరికన్ ఫిజికల్ సొసైటీ , అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్‌కు ఎన్నికయ్యారు.

గుగ్గెన్‌హీమ్, రాడ్‌క్లిఫ్ ఫెలోషిప్‌లను సైతం ప్రియంవద అందుకున్నారు.యేల్ యూనివర్సిటీలో 2000వ సంవత్సరం నుంచి ఫ్యాకల్టీ మెంబర్‌గా వున్న నటరాజన్.సైన్స్ అండ్ హ్యుమానిటీస్‌లో( Science and Humanities ) ఫ్రాంకే ప్రోగ్రామ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube