గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు కారకులైన అధికారులపై చర్య తీసుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.ఈ సందర్భంగా ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 12 న భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లీక్ పల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే విద్యార్థి సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురై ఐదు రోజులు గా మృత్యువుతో పోరాడిన విద్యార్థి ప్రశాంత్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.

 Action Should Be Taken Against The Officials Responsible For Food Poisoning In G-TeluguStop.com

ఆరవ తరగతి చదువుతున్న ప్రశాంత్ ఈ నెల 12 న బడిలో తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని,

ప్రశాంత్ తో పాటు మరో 24 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో సతమతం అయ్యారని వీరిలో ప్రశాంత్ పరిస్థితి విషమంగా వుండటం తో 13 న హైద్రాబాద్ తరలించారు .ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి రెయిన్ బో ఆసుపత్రి లో మంగళవారం చనిపోవడం జరిగిందని,మిగిలిన విద్యార్థులలో సికింద్రాబాద్ గాంధీలో ముగ్గురు, ఉస్మానియాలో ఇద్దరు విద్యార్థులు, భువనగిరి జిల్లాలో ఏడుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారన్నారు.చనిపోయిన విద్యార్థులకి 10 లక్షలు ప్రభుత్వ తరపున పరిహారం చెల్లించాలని,అలాగే మిగిలిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు.

ఫుడ్ పాయిజన్ తో మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని విద్యాశాఖను, ప్రభుత్వాన్ని కోరారు.

లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, కొడం వెంకటేష్,బైరాగోని హర్శిత్,కొడం నరేష్, వసిం, అక్రం,సమీ,సుదీప్,వంశి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube