కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసినా తమ నటనతో ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం చూపుతారు.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో మీనాక్షి చౌదరి కూడా ఒకరనే సంగతి తెలిసిందే.
తాజాగా మీనాక్షి చౌదరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబం గురించి తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనాక్షి చౌదరి తాను ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉన్న కుటుంబం నుంచి వచ్చానని అటు చదువులో ఇటు స్పోర్ట్స్ లో టాప్ లో ఉండేదానినని తెలిపారు.
హరియాణాలోని చిన్న గ్రామంలో నేను జన్మించానని నాన్నకు బదిలీలు ఎక్కువ కావడంతో దేశమంతా తిరిగానని ఆమె కామెంట్లు చేశారు.తెలుగులో సమంత, కీర్తి సురేష్, అనుష్క అంటే అభిమానమని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చారు.
శేఖర్ కమ్ముల మూవీలో నటించాలని ఉందని ఆమె కామెంట్ చేశారు.20 సంవత్సరాల వయస్సులో నాన్న చనిపోయారని ఆ సమయంలో నేను డెంటిస్ట్ గా పని చేస్తున్నానని మీనాక్షి తెలిపారు.ఆ సమయంలో డెంటల్ కోర్స్ చేస్తున్న నేను చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేదని ఆమె వెల్లడించారు.ఆ సమయంలో అమ్మ చదువుకు బ్రేక్ ఇస్తే ఇవ్వు ఖాళీగా ఉండకని మిస్ ఇండియా పోటీలకు ట్రై చేయమని సూచించారని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.
ఆ సమయంలో భర్త చనిపోతే నన్ను మిస్ ఇండియా పోటీలకు పంపడంపై అమ్మపై నెగిటివ్ కామెంట్లు వచ్చాయని ఆమె తెలిపారు.నేను ఆ పోటీలలో పాల్గొని మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నానని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చారు.మీనాక్షి చౌదరి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మీనాక్షి చౌదరి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.