మే 9వ తేదీ టాలీవుడ్ కు ఎంతో స్పెషల్.. ఈ తేదీన విడుదలైన ఇన్ని సినిమాలు హిట్టయ్యాయా?

టాలీవుడ్ ఇండస్టీకి ఏప్రిల్ 28వ తేదీ లక్కీ డేట్ అనే సంగతి తెలిసిందే.ఆ తేదీన విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 May 9th Is Very Special To Tollywood Industry Details Here Goes Viral In Social-TeluguStop.com

అయితే ఏప్రిల్ 28వ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆ స్థాయిలో కలిసొచ్చిన డేట్ ఏదనే ప్రశ్నకు మాత్రం మే 9వ తేదీ సమాధానంగా వినిపిస్తుంది.మే 9వ తేదీ టాలీవుడ్ కు ఎంతో స్పెషల్ డేట్ కావడం గమనార్హం.చిరంజీవి, మహేష్ బాబు లాంటి చాలామంది హీరోలకు ఈ డేట్ కలిసొచ్చింది.

1990 సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ( Jagadekaveerudu Atilokasundari movie )అప్పట్లోనే 15 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు ఐదు విభాగాలలో నంది అవార్డులు వచ్చాయి.చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా సైతం అదే తేదీకి విడుదలైంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

Telugu Mahanati, Maharshi, Tollywood, Santhosham-Movie

వెంకటేశ్ హీరోగా నటించిన ప్రేమించుకుందాంరా సినిమా( Preminchukundam ra ) సైతం ఇదే తేదీన థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది.నాగార్జున దశరథ్ కాంబోలో తెరకెక్కిన సంతోషం సినిమా ( Santhosham )సైతం ఇదే తేదీన విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమాలో నాగ్ నటనను నంది అవార్డ్ వచ్చింది.కీర్తి సురేష్ నటించిన మహానటి( Mahanati ) సినిమా సైతం ఇదే తేదీన విడుదలైంది.

Telugu Mahanati, Maharshi, Tollywood, Santhosham-Movie

పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన మహానటి సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటిందనే చెప్పాలి.ఈ సినిమా కీరి సురేష్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా( Maharshi movie ) సైతం ఇదే తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.కల్కి ఇదే తేదీన విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube