పాన్ ఇండియా స్టార్స్ బ్లెస్సింగ్స్ తో "మాటరాని మౌనమిది" ట్రైలర్ విడుదల

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకుపూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా “మాటరాని మౌనమిది”.మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 matarani Maunamidi Trailer Released With Pan India Stars Blessings , Mahesh Dutt-TeluguStop.com

లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్నదీ సినిమా.తుది హంగులు అద్దుకుంటున్న “మాటరాని మౌనమిది” సినిమా ఆగస్టు 19న విడుదల కాబోతోంది.తాజాగా చిత్ర ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్స్ అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ బ్లెస్సింగ్స్ తో రిలీజ్ చేశారు.

మాటరాని మౌనమిది” మూవీ ట్రైలర్ చూస్తే లవ్, మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.స్నేహితుడిలా ఉండే బావ ఇంటికి వెళ్తాడు హీరో.అక్కడ అతనికి మాటలు రాని క్లాసికల్ డాన్సర్ పరిచయం అవుతుంది.ఈ అమ్మాయితో రిలేషన్ ఏర్పడుతుందిి.ఒకరోజు హీరో బావ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతాయి.

అవి ఇప్పటిదాకా తను చూడని, వినని ఆ ఇన్సిడెంట్స్ అందరినీ షాక్ కు గురిచేస్తాయి.ఆ ఘటనలు ఏంటి, అంతు చిక్కని అదృశ్య శక్తి ఏం చేసింది అనేది ట్రైలర్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వస్తోంది.సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఇప్పుడు ట్రైలర్ ఆ ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగేలా ఉన్నాయి.ఆగస్టు 19న “మాటరాని మౌనమిది” సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.న‌టీ న‌టులు – మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube