హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన తాజా చిత్రం తుణివు. ఈ సినిమాలో అజిత్ సరసన మలయాళీ స్టార్ నటి అయిన మంజు వారియర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాను జీ సినిమాతో కలిసి బోనీ కపూర్ నిర్మించారు.కాగా ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అజిత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే నటి మంజు వారియర్ అజిత్ సరసన తొలిసారిగా నటించింది.అలాగే మంజు వారియర్ తమిళంలో నటిస్తున్న రెండవ సినిమా ఇది.
అయితే ఇదివరకు హీరో ధనుష్ తో కలిసి అసురన్ సినిమాలో నటించి మెప్పించింది మంజు వారియర్.ఇది ఇలా ఉంటే తుణివు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి మంజు తుణివు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.తుణివు సినిమా తనకు కొత్త అనుభవమని, ఇంతకుముందు నటించిన అసలు సినిమాలోని పాత్రకు, ఈ సినిమాలోని పాత్రకు అసలు సంబంధం ఉండదని, ఈ సినిమాలో తాను యాక్షన్ హీరోయిన్గా కనిపించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఇందులో కల్మణి అనే యువతి పాత్రలో నటించిన్నట్లు తెలిపింది.అందులో ఒక చేతితో తుపాకీ కాల్చడం చాలా కష్టతరం కావడంతో హీరో అజిత్ తనకు నేర్పించినట్లు ఆమె తెలిపింది.

అంతేకాకుండా తాను ఇంతకుముందు అనేక సినిమాలలో నటించినప్పటికీ ఇటువంటి యాక్షన్ పాతలో నటించడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది నటి మంజు వారియర్.అసురన్ సినిమా తర్వాత మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుండగా ఆ తరుణంలో ఈ సినిమా అవకాశం వచ్చిందని ఆమె తెలిపింది.ఈ సినిమాలో కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పినట్లు ఆమె తెలిపింది.అసురన్ సినిమాలో తన పాత్రను ఎలా అయితే ప్రేక్షకులు ఆదరించారో ఈ సినిమాలో కూడా తన పాత్రను పేక్షకులు అలాగే ప్రోత్సహిస్తారని భావిస్తున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.