"ఒరిజినల్ గ్యాంగ్​స్టర్స్" కలిసిన వేళ అంటున్న మంచు విష్ణు..!

కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ అలాగే టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పేరు పొందిన మోహన్ బాబు లు ఇద్దరు మంచి స్నేహితులు.ఈ విషయం సినీ వర్గానికి మాత్రమే కాకుండా సాధారణ ప్రజా వర్గాన్ని కూడా తెలిసిన విషయమే.

 Manchu Vishnu Shared Rajnikanth And Mohan Babu Photos, Manch Vishnu, Mohan Babu,-TeluguStop.com

ఈ ఇరు కుటుంబాలు అన్ని విషయాల్లో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటాయి.ఈ విషయం మరోసారి నిరూపితమైంది.

ఇందుకు సంబంధించి తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వైరల్ గా మారిన ఈ ఫోటోలలో వైట్ అండ్ వైట్ లుక్ లో వీరు ముగ్గురు మెరిసిపోతున్నారు.

ఈ ఫోటోలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురుస్తుంది.ఇందులో కొందరు నెటిజెన్స్ రియల్ లైఫ్ గ్యాంగ్ స్టార్స్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల కాలంలోనే ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న షూటింగ్ కొరకు హైదరాబాద్ కి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

షూటింగ్ నిమిత్తం దాదాపు నెల రోజుల సమయం పాటు హీరో రజనీకాంత్ హైదరాబాద్ లోనే ఉండిపోయారు.

ఆ సమయంలోనే రజనీకాంత్ మోహన్ బాబు ఇంటికి వెళ్లి వారితో సరదాగా గడిపిన కొన్ని ఫోటోలను మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనం చూశాం.ఇకపోతే తాజాగా ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు విష్ణు.

ఈ ఫోటోలకు మంచు విష్ణు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ కలిసిన వేళ అంటూ క్యాప్షన్ ని కూడా జత చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube