ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ షోలో జరిగే కామెడీలు అంతా ఇంతా కాదు.
ఇందులో పాల్గొనే కమెడియన్స్ తమ టీమ్ లతో కలిసి ఎంతో వినోదాన్ని పంచుతారు.అంతేకాకుండా జబర్దస్త్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.
ఇక ఈ షో దాదాపు 8 ఏళ్లు నుండి ప్రసారమవుతుంది.ఇందులో హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి పలువురు కమెడియన్స్ గురించి అందరికీ తెలిసిందే.
వీళ్ళు జబర్దస్త్ కు ప్రాణం లాంటి వాళ్లనే చెప్పాలి.ముఖ్యంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు మాత్రం మంచి పేరు సంపాదించుకున్నారు.ఈ షో తాము మర్చిపోలేని జ్ఞాపకాలు సంపాదించుకున్నారు.కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా బాగా సందడి చేశారు.
ఇక సుడిగాలి సుధీర్ మాత్రం బుల్లి తెర స్టార్ గా ఒక గుర్తింపు కూడా సొంతం చేసుకున్నాడు.జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో కూడా బాగా సందడి చేశాడు.
అయితే గెటప్ శ్రీను జబర్దస్త్ షో నుండి మూడు నెలల క్రితమే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
సుడిగాలి సుధీర్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు జబర్దస్త్, ఢీ డాన్స్ షో లో నుండి బయటకు వచ్చాడు.అయితే వీరిద్దరు బయటకి రావడంతో మల్లెమాల ప్రొడక్షన్ పై చాలా రకాల రూమర్లు వచ్చాయి.నిజానికి మల్లెమాల ప్రొడక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తమ మీద వచ్చిన కామెంట్లను తిరిగి తిప్పి కొట్టే విధంగా స్కిట్ లు చేస్తూ ఉంటాయి.ఏదైనా వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటాది మల్లెమాల.
అలా సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడంతో మల్లెమాలకు నెగెటివ్ కామెంట్లు రావడంతో వాళ్లు వెళ్లిపోవడానికి మరో కారణం ఉంది అని మల్లెమాల ఓ స్కిట్ ద్వారా చెప్పించింది.తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ సంబంధించిన ప్రోమో విడుదలయింది.
అందులో రాకింగ్ రాకేష్ వేసిన స్కిట్ బాగా ఎమోషనల్ గా అనిపించింది.ఎందుకంటే అందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లా స్నేహం గురించి చెప్పి.ఆ తర్వాత తమ తప్పేమీ లేదన్నట్లుగా చెబుతూ.వాళ్లకు సినిమా ఛాన్సులు వస్తుండటంతో షోను వదిలేశారు అని.మళ్లీ వెనక్కి వస్తారు అన్నట్టుగా మల్లెమాల చెప్పించిన స్కిట్టు ద్వారా తెలిపింది.దీంతో మొత్తానికి ఈ ప్రోమో ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తున్నారు అన్నట్లు తెలిసింది.
కానీ వీళ్ళు ఎప్పుడు వస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదు.వీరి కోసం బుల్లితెర ప్రేక్షకులు మాత్రం బాగా ఎదురు చూస్తున్నారు.