ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలు ఒక స్థాయికి చేరుకుంటే చాలు వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదని చెప్పాలి.తమ ముందు తమ పిల్లలు ఎదుగుతూ ఉంటుంటే చూసి చాలా మురిసిపోతూ ఉంటారు.
అది సామాన్యులైన కానీ సెలబ్రిటీలైన కానీ.అయితే తాజాగా హీరో మహేష్ బాబు తన కూతుర్ని బిగ్ స్క్రీన్ పై చూసి తెగ మురిసిపోతున్నాడు.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాంమహేష్ బాబు( Mahesh Babu ) గారాల కూతురు సితార అందరికీ బాగా పరిచయం.చిన్నప్పటినుంచి తెలుగు ప్రేక్షకులు ఆమెను చూస్తూనే ఉన్నారు.
ఇండస్ట్రీ పరిచయం చేయకున్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా కనిపిస్తుంది.తల్లి తండ్రి కంటే ఎక్కువగా పోస్ట్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తన తండ్రి నుండి ఎంతో అభిమానం సొంతం చేసుకుంది.
అతి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీతార( sitara ) తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ తన వైపు మలుపుకుంది.చిన్నవయసులోనే సోషల్ మీడియాలో తన పేరుమీద ఖాతాలను కూడా సృష్టించుకుంది.ఇక ఆ సోషల్ మీడియా ఖాతాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, తన డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.అంతే కాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటుంది.
ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది సితార.పైగా ఆ మధ్య వెండితెరపై కూడా అడుగుపెట్టింది.
తన తండ్రి నటించిన సర్కారు వారి పాటలో ఒక పాటకు స్టెప్పులు కూడా వేసింది.క్లాసికల్ డాన్స్ లే వెస్టర్డ్ డాన్స్ లు కూడా చేస్తూ ఉంటుంది.
ట్రెడిషనల్ లుక్ లోనే కాకుండా అప్పుడప్పుడు గ్లామర్ లుక్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది.
ఇక సితార లో ఇన్ని క్వాలిటీస్ ఉండటంతో త్వరలోనే ఆమె హీరోయిన్ అవ్వటం ఖాయమని మహేష్ బాబు అభిమానులు తెగ మురిసిపోతున్నారు.ఇప్పటికే సీతార మంచి హైట్ మంచి టాలెంట్ ను సొంతం చేసుకుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక జ్యువెలరీ మాల్ ను ప్రమోట్ చేయడానికి నగలు వేసుకుని ఫోటోషూట్లు చేయించుకుంది.
ఇక ఆ జువెలరీ షాపింగ్ మాల్ బిగ్ స్క్రీన్ పై సితార దిగిన ఫోటోలను చూపిస్తూ ప్రిన్సెస్ సితార అంటూ అద్భుతంగా చూపించారు.
ఇక అది మన దేశంలో కాకుండా వేరే దేశంలో అన్నట్లుగా కనిపించింది.ఆ స్క్రీన్ లో సితార అందంగా తయారవ్వటమే కాకుండా విలువైన నగలు ధరించి ఒక చిన్న స్మైల్ తో అందర్నీ ఫిదా చేసింది.ఇక అందులో తన అందం హీరోయిన్స్ ను మించి ఉందని చెప్పాలి.
దీంతో కూతురు బిగ్ స్క్రీన్ పై కనిపించడంతో మహేష్ బాబు తన కూతురు ఫోటోలను పంచుకొని తెగ మురిసిపోయాడు.తల్లి నమ్రత కూడా ఆ ఫోటోలు పంచుకొని బాగా ఆనందంలో మునిగిపోయింది.
ప్రస్తుతం ఆ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి.