ఖమ్మం కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పొంగులేటితో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.
ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఘర్ వాపసిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే.అటు బీజేపీ నేతలపై రాజగోపాల్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పొంగులేటితో రాజగోపాల్ రెడ్డి చేరిక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.