మహేష్‌.. త్రివిక్రమ్‌ మూవీ ఆ వర్క్‌ షురూ అయ్యిందా ? లేదా?

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా గురించి దాదాపు ఏడాది కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.సర్కారు వారి పాట సినిమా పూర్తి అయ్యే వరకు మహేష్‌ బాబు కొత్త సినిమా ను చేసేది లేదు అంటూ తేల్చి చెప్పడంతో త్రివిక్రమ్ మొన్నటి వరకు భీమ్లా నాయక్ సినిమా పనిలో ఉన్నాడు.

 Mahesh Babu And Trivikram Movie News, Flim News, Mahesh Babu, Sarkaru Vaari Pata-TeluguStop.com

ఆ తర్వాత డీజే టిల్లు పనిలో కూడా పడ్డాడు.ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ ను మొదలు పెట్టాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి నుండి సమాచారం అందుతోంది.

ప్రస్తుతం మహేష్‌ బాబు సినిమా కోసం త్రివిక్రమ్‌ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా భారీగా ఉంటుందనే నమ్మకం తో త్రివిక్రమ్‌ ఉన్నాడు.

Telugu Mahesh Babu, Trivikram-Movie

ఈ సినిమా ను మహేష్‌ బాబు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడని తెలుస్తోంది.ప్రస్తుతం సినిమా స్టోరీ డెవలప్‌ చేసే పనిలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది.త్రివిక్రమ్‌ మరియు మహేష్‌ బాబు ల కాంబోలో ఇప్పటికే అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చాయి.ఆ రెండు సినిమాలు కూడా మంచి కమర్షియల్‌ సక్సెస్ లను దక్కించుకోలేదు.

కాని అనూహ్యంగా వీరి సినిమాలు మాత్రం బుల్లి తెరపై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.రికార్డ్‌ బ్రేకింగ్‌ టీఆర్పీ ని దక్కించుకున్న ఘనత ఈ సినిమాలకు దక్కుతుంది.

అందుకే వీరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయంటూ అంతా చర్చ జరుగుతోంది.ప్రస్తుతం సర్కారు వారి సినిమా ముగింపు దశకు చేరుకుంది.కనుక ఏప్రిల్‌ లేదా మే లో సినిమా ను త్రివిక్రమ్‌ పట్టాలెక్కించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube