రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ఇటీవల ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే జైల్లో ఉన్న అర్నాబ్ పై దాడి జరిగిందని, ఈ క్రమంలో ఆయనను తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు సైతం అనుమతించలేదు అంటూ వార్తలు వెల్లడయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి పై అలానే జైల్లో ఆయనకు కల్పించే భద్రత పై ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు ఫోన్ చేసి గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తో ఈ ఉదయం(సోమవారం) ఫోన్ లో మాట్లాడిన ఆయన.అర్నాబ్ కు సెక్యూరిటీ కల్పించాలని, అంతేకాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ ను కలుసుకునేందుకు కూడా అర్నాబ్ కు అనుమతి ఇవ్వాలి అని కోరారు.
కాగా జైల్లో గోస్వామి తన సెల్ ఫోన్ ను ఉపయోగిస్తుండగా అధికారులు చూశారని సమాచారం.
గతవారం ఆయనను పోలీసులు అరెస్టు చేసి ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నప్పటికీ అది మళ్ళీ ఆయనకు ఎలా అందిందో అన్న విషయం తెలియరాలేదు.ఇంటీరియర్ ఆత్మహత్య కేసుకు సంబంధించి అర్నాబ్ పై కేసు నమోదు కావడంతో గతవారమే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనితో ఆయనను ఈ నెల 18 వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం తో ప్రస్తుతం ఆయనను తలోబా జైలుకు తరలించినట్లు సమాచారం.సోమవారం ఉదయం గవర్నర్ కోషియారీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఫోన్ చేసి, అర్నబ్ ఆరోగ్య పరిస్థితి, భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా అర్నబ్ కుటుంబీకులు తనను కలిసేలా ఏర్పాట్లు చేయాలని కూడా గవర్నర్ ఆదేశించినట్టు సమాచారం.అయితే జైల్లో అధికారులు తనను వేధిస్తున్నారని, కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవడానికి అనుమతించడం లేదని అర్నాబ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో గవర్నర్ కోషియారి హోంమంత్రి దేశ్‌ముఖ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం.