ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ అప్పటి వరకు న్యాచురల్ డైరెక్టర్ అని అంతా అనుకున్నారు.కానీ గత ఏడాది మహానటి సినిమాతో మనోడు తన టాలెంట్ ని బయటపెట్టాడు.
ఎవరు ఊహించని విధంగా సావిత్రి బయోపిక్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

అయితే ఆ సినిమా తరువాత నాగ్ అశ్విన్ పై అంచనాలు పెరిగిపోవడంతో తదుపరి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకోవాల్సివస్తోంది.మొత్తానికి నాగ్ అశ్విన్ ఒక బిగ్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.వైజయంతి మూవీస్ నుంచి అఫీషియల్ ఎనౌన్సమెంట్ కూడా వచ్చేసింది.
సెప్టెంబర్ లో ఒక పెద్ద సినిమా నాగ అశ్విన్ డైరెక్షన్ లో స్టార్ట్ కానున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
అలాగే కొత్తవారు ఈ సినిమా ద్వారా టాలెంట్ ని నీరుపించుకోవచ్చని ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు.
ఇకపోతే గతంలో నాగ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథను రెడీ చేసినట్లు టాక్ వచ్చింది.వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ మెగాస్టార్ ని ఒప్పించినట్లు కథనాలు కూడా వచ్చాయి.
కానీ ఆ కాంబినేషన్ పై ఇంతవరకు క్లారిటీ లేదు, మరి నాగ అశ్విన్ ఏ హీరోతో వర్క్ చేస్తాడో చూడాలి.