కోడెల శివప్రసాద్ వారి కుటుంబం పై వైసీపీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఒక్క వైసీపీ పార్టీ నే కోడెల పై వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది అనుకుంటే సొంత పార్టీ నేతలు కూడా కోడెల న్యాయకత్వం పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.
సత్తెన పల్లి టీడీపీ లో కోడెల పై అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఈ రోజు పలువురు కోడెల అసమ్మతి నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు ని కలవనున్నట్లు తెలుస్తుంది.
సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జి నియమించాలని, సత్తెనపల్లి పట్టణంలో పాత టీడీపీ కార్యాయలం తిరిగి ప్రారంభించాలని బాబు ను కోరనున్నట్లు తెలుస్తుంది.అలానే కోడెల నాయకత్వం తమయు అవసరం లేదని కూడా తెలుగు తమ్ముళ్లు బాబుకు విన్నవించనున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు కోడెల కూడా వీరిని బాబు వద్దకు వెళ్లకుండా ఆపాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.చంద్రబాబు వద్దకు వెళ్లవద్దని మాజీ మున్సిపల్ ఛైర్మన్, సత్తెనపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడుకు కోడెల ఫోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మరి దీనిపై బాబు గారు ఎలా స్పందిస్తారో చూడాలి.







