టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య డిఫరెంట్ కథలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా ఎండింగ్ దశలో ఉంది.వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అయితే నాని సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ V మరింత స్పెషల్ గా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఎప్పుడు లేని విధంగా కెరీర్ లో మొదటిసారి నాని సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నట్లు టాక్.V సినిమాకు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు.సుధీర్ బాబు కూడా ఆ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది.25వ చిత్రం కావడంతో కొత్తగా ఉండాలని స్ట్రాంగ్ గా సిక్స్ ప్యాక్ షేప్ కోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు టాక్ వస్తోంది.మరి నానికి సిక్స్ ప్యాక్ ఎంతవరకు సెట్టవుతుందో చూడాలి.
.