నూజివీడులో రైతుల సమావేశంలో సీఎం జగన్ పై లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

నారా లోకేష్ “యువగళం” పాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గానికి చెందిన మామిడి రైతులతో నారా లోకేష్ ముఖాముఖి( Nara Lokesh ) నిర్వహించారు.

 Lokesh's Serious Comments On Cm Jagan In Farmers' Meeting To Nuzividu Nara Lokes-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైసీపీ అరాచక పాలన కారణంగా రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారని విమర్శించారు.

దేశంలో రైతుల ఆత్మహత్యలకి సంబంధించి ఏపీ మూడో స్థానంలో ఉందని కౌలు రైతుల ఆత్మహత్యలో రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ( TDP ) అధికారంలోకి రాగానే మామిడి రైతులను ఆదుకొని వారి కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు.

కరోనా సమయంలో మామిడి రైతులు నష్టపోతే జగన్ వైరస్ వల్ల తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు.

అప్పట్లో ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన జగన్( YS Jagan Mohan Reddy )ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పడు మడమతిపాడు ఈ జగన్ అని విమర్శించారు.

ఎన్నికల ముందు ప్రతి రైతుకి ₹12,500 రైతు భరోసా కింద ఇస్తానని చెప్పిన ఈ జగన్.ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ₹7500 రూపాయలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు.

దీంతో మొత్తంగా ఒక్కొక్క రైతుకి ₹25 వేల రూపాయలు సైకో జగన్ బాకీ ఉన్నాడని విమర్శించారు.ఎరువుల ధరలు.పురుగుల మందులు ధరలు విపరీతంగా పెంచేశారు.రైతులకు అనేక హామీలు ఇచ్చిన ఈ జగన్ ఒకటి కూడా నెరవేర్చలేదు.

పాదయాత్రలో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తానని దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు అని సీఎం జగన్ పై నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube