ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో లోకేశ్ కనగరాజ్( Director Lokesh Kanagaraj ) పేరు మారుమ్రోగుతోంది.లియో సినిమాతో మరిన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాలతో ఎలాంటి ఫలితాను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకోగా అక్టోబర్ 19వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.
లియో( Leo ) తెలుగు రాష్ట్రాల హక్కులు 22 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయంటే విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబోకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థమవుతుంది.విజయ్ గత సినిమా వారసుడు లోకేశ్ కనగరాజ్ గత సినిమా విక్రమ్ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.లియోలో రామ్ చరణ్( Ram Charan ) కూడా గెస్ట్ రోల్ పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
అయితే లోకేశ్ కనగరాజ్ వ్యక్తిగత జీవితం గురించి కుటుంబ సభ్యుల గురించి తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.లోకేశ్ కనగరాజ్ సిస్టర్( Lokesh Kanagaraj Sister ) కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆమె అందానికి హీరోయిన్లు కూడా సాటిరారంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.లోకేశ్ కనగరాజ్ సిస్టర్ పేరు అవంతిక కనగరాజ్( Avantika Kanagaraj ) కాగా ఈమె లోకేశ్ కు చెల్లి అవుతుంది.
అవంతిక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ ప్రొడ్యూసర్, టాలెంట్ మేనేజర్ గా ఉన్నారు.అవంతికకు యాక్టింగ్ అంటే ఆసక్తి లేదు కానీ అవంతిక సినిమాల్లోకి వస్తే మాత్రం మామూలుగా ఉండదని నెటిజన్ల( Netizens ) నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అవంతిక రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.
అవంతికకు ఇన్ స్టాగ్రామ్ లో 35,000 మంది ఫాలోవర్లు ఉన్నారని సమాచారం అందుతోంది.