మన నిజ జీవితంలో డబ్బుకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.ఆర్థికంగా ఉండే ఇబ్బందుల వల్ల ఎంతోమంది యువతీయువకులు కన్న కలలను నెరవేర్చుకునే విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కుటుంబ సభ్యుల సపోర్ట్ తో లక్ష్యాన్ని సాధించి సాయి శశాంక్( Sai Sashank ) వార్తల్లో నిలిచారు.తన సక్సెస్ స్టోరీతో సాయి శశాంక్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుండటం గమనార్హం.
కమలాపురం గ్రామానికి చెందిన సాయి శశాంక్ చదువు పూర్తైన తర్వాత పోలీస్ శాఖలో జాబ్ చేస్తే తన కెరీర్ బాగుంటుందని భావించారు.తాజాగా వెలువడిన ఫలితాల్లో సాయి శశాంక్ సివిల్ ఎస్సై ( Civil SI ) జాబ్ కు ఎంపికయ్యారు.
సాయి శశాంక్ తండ్రి పేరు తాటికొండ మాధవాచారి కాగా మాధవాచారి గ్రామంలో డిష్ ఆపరేటర్ గా ( Dish Operator ) పని చేస్తున్నారు.తాపర్ విద్యా విహార్ హై స్కూల్ లో పదో తరగతి వరకు చదివిన సాయి శశాంక్ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
చదువు పూర్తైన తర్వాత ఎస్సై పోస్టుల కోసం ఎంతో కష్టపడిన సాయి శశాంక్ కాళేశ్వరం జోన్1 నుంచి ఓపెన్ కటాఫ్ లో మంచి మార్కులతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.సాయి శశాంక్ ఎస్సై జాబ్ కు ( SI Job )ఎంపిక కావడం కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.సాయి శశాంక్ భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.సాయి శశాంక్ తన సక్సెస్ స్టోరీతో( Success Story ) ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.
సాయి శశాంక్ విజయ ప్రయాణం ఎంతోమంది ఆకట్టుకుంటోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.భవిష్యత్తులో సాయి శశాంక్ కెరీర్ ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ యువకుడి సక్సెస్ స్టోరీ ఎంతో గొప్పదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.