త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్ బిజెపిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక తెలంగాణ విషయానికొస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధించింది.
బిఆర్ఎస్, బిజెపిలు ఓటమి చెందాయి.త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో బిజెపి , బీఆర్ఎస్ లు ఉన్నాయి.
అందుకే కాంగ్రెస్ కు ధీటుగా బలమైన అభ్యర్థులను పోటీకి దింపి, వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలనే వ్యూహాలను రచిస్తున్నాయి.అయితే ఈ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నాయకత్వానికి మాత్రం సవాల్ గా మారబోతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించి తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )పైన పడింది.ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటేనే అధిష్టానం పెద్దల వద్ద రేవంత్ పలుకుబడి నిలబడుతుంది.దీంతో సమర్థవంతమైన అభ్యర్థుల ఎంపిక చేసేందుకు కొద్దిరోజులుగా రేవంత్ కసరత్తు చేస్తున్నారు.తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాల్లో 14 స్థానాలనైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది.
మిగతా మూడు స్థానాల్లో గెలుపు పై కాంగ్రెస్ ఆశలు వదిలేసుకుంది. వాటిలో ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉండే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కూడా ఉంది.
ఇక బిజెపి కూడా ఎంపీ స్థానాలను గెలుచుకునే విషయంలో ధీమా గానే ఉంది.కనీసం ఐదారు స్థానాలనైన గెలుచుకుంటామని ధీమాను వ్యక్తం చేస్తోంది .ఇక కాంగ్రెస్ , బిజెపిల కంటే ఎక్కువ స్థానాల్లో నే గెలుస్తామని ధీమాను వ్యక్తం చేస్తుంది.మిగతా రెండు పార్టీల విషయం ఎలా ఉన్నా.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇటు తెలంగాణ ప్రజల్లోనూ కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద తమ పలుకుబడిని నిలుపుకోవాలంటే కచ్చితంగా ఇక్కడ ఎక్కువ స్థానాల్లో గెలిస్తేనే సాధ్యమవుతుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.