టీడీపీ( TDP ) ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై పలు నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి.ఈ క్రమంలోనే గజపతినగరం( Gajapatinagaram ) టీడీపీలో అసంతృప్తి రగిలింది.
నియోజకవర్గ టికెట్ ను కేఏ నాయుడుకి కేటాయించకపోవడంపై పార్టీ క్యాడర్ తీవ్ర అంసతృప్తిగా ఉంది.ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు దూరంగా ఉండాలని నాయుడిపై పార్టీ శ్రేణులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
అయితే గజపతినగరం నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం కొండపల్లి శ్రీనివాసరావుకు( Kondapalli Srinivasa Rao ) టికెట్ కేటాయించింది.దీంతో భవిష్యత్ కార్యాచరణపై నాయుడు పార్టీ క్యాడర్ తో కలిసి సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది.