ఏపీలో రాజకీయాలు ఎప్పుడు నిప్పులా రగులుతూనే ఉంటాయన్న సంగతి తెలిసిందే.అదీగాకుండా ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పధకాలను అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లోటును కూడా ఎదుర్కొంటుంది.
ఇక రాజకీయ వివాదాలు, ఆరోపణలు, విమర్శలు చేసుకోలేనిదే ఇక్కడి నేతలకు పొద్దు పోదనే ప్రచారం ఎలాగో ఉంది.
ఇదిలా ఉండగా అమరావతి విషయంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా అమరావతి స్మార్ట్ సిటీ ప్రాంతంలో చేపట్టాల్సిన ముఖ్యమైన పనుల విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా అమరావతి శాసన రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానం కోసం కృష్ణా కుడుగట్టున 15.5 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణను చేయబోతున్నారు.
అంతే కాకుండా రూ.360 కోట్ల రూపాయలను గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం వీటి ద్వారా స్మార్ట్ వార్డులు, స్మార్ట్ పోల్స్ నిర్మాణం తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం, పది ముఖ్యమైన ప్రాజెక్టులతో పాటుగా మరో కొత్త ప్రాజెక్టు నిర్మాణం కు ఖర్చు చేయాలని నిర్ణయించింది.ఈ బాధ్యతలను సస్టయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కు అప్పగించారు.