టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కాంతారావు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.సూర్యాపేట జిల్లాలోని గుడిబండ గ్రామంలో కాంతారావు జన్మించారు.
కాంతారావు తన సినీ కెరీర్ లో 400కు పైగా సినిమాలలో నటించారు.జానపద, పౌరాణిక పాత్రలలో ఎక్కువగా నటించిన కాంతారావు ఆ పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.
దాసరి నారాయణరావు ఒక సందర్భంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ కు కళ్లు అయితే కాంతారావు తిలకం అని ప్రశంసించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ కు సమాన స్థాయిలో కాంతారావు కూడా గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.1951 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు కాంతారావు నటుడిగా కెరీర్ ను కొనసాగించారు.కాంతారావును చాలామంది కత్తి కాంతారావు అని కూడా పిలుస్తారు.
ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రను అద్భుతంగా పోషించి నటుడిగా కాంతారావు ప్రశంసలను సొంతం చేసుకోవడం గమనార్హం.
అయితే చివరి రోజుల్లో కాంతారావు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

కాంతారావుకు చెడు అలవాట్లు లేకపోయినా లౌక్యం లేకపోవడం వల్ల చివరి రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి.రెమ్యునరేషన్ విషయంలో కాంతారావు ఆచితూచి వ్యవహరించేవారు కాదు.ఎంత ఇచ్చినా తీసుకోవడం ఆయనకు మైనస్ అయింది.కాంతారావు నిర్మాతగా నిర్మించిన సినిమాలలో గండర గండడు మాత్రమే విజయం సాధించింది.

ఒక దశలో కాంతారావు హైదరాబాద్ లో అద్దె ఇంట్లో జీవనం సాగించారు.సొంత ఇల్లు కొనుక్కోవాలని, తనను కేంద్రం స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించాలని, ఎన్టీఆర్ జాతీయ అవార్డు తనకు రావాలని కాంతారావు మూడు కోరికలు కోరుకోగా ఒక్క కోరిక కూడా నెరవేరలేదు.సినిమాల్లో కాంతారావు కత్తివీరుడు అయినా రియల్ లైఫ్ లో మాత్రం జీవనసమరాన్ని ఆయన జయించలేదు.టి.సుబ్బరామిరెడ్డి పది లక్షల రూపాయలు ఇవ్వగా కాంతారావు కేన్సర్ చికిత్స కోసం ఆ డబ్బును ఖర్చు చేశారు.