బ్యాంకు ఖాతాలో సొమ్ము మాయం చేసిన అధికార పార్టీకి చెందిన నాయకులు 90 లక్షల కాజేచేసారంటూ పోలీసల కు ఫిర్యాదు చేసిన బాధితురాలు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం భోగాపురం.
అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు కీలక సూత్రధారులుగా వ్యవహరించి తన ఖాతాలోని సొమ్మును కాజేసారంటూ బాధితురాలు ఆరోపిస్తుంది .భాగాపురం మండలంలోని కొయ్యపేట గ్రామానికి చెందిన మహిళా రైతు కొయ్య అప్పలనరసమ్మ ఖాతా నుండి ఏకంగా రూ.90 లక్షల కాజేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.అప్పల నరసమ్మకు కంచెరు రెవిన్యూ పరిధిలో సర్వే 296/3 లో 4-03 ఎకరాల భూమి ఉంది.
అయితే ఈ మొత్తం భూమి ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూసేకరణలో ప్రభుత్వం సేకరించింది దీనిగాను పరిహారం కింద రూ.కోటి 32 లక్షలు ప్రభుత్వం పరిహారం తన అకౌంట్లో వేసిందని అందులో దఫ దఫాలుగా రూ.40 లక్షలు మాత్రమే ఇచ్చారని, నా యొక్క బ్యాంకు పుస్తకం సైతం వారి వద్దనే ఉంచుకున్నారని బైరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని అనేక రకాలుగా మాయ మాటలు చెప్పి తన వద్దనున్న బ్యాంకు పాస్ పుస్తకాలను పట్టుకు వెళ్లారని అధికార పార్టీకి చెందిన నాయకులు బైరెడ్డి ఎర్రప్పల నారాయణ, బోయ రమణ (అన్నమయ్య ) బ్యాంకు ఖాతా నుంచి నుంచే అకౌంట్ ట్రాన్స్ఫర్ 4 వ్యక్తుల పేరున చేయించుకున్నారని బోయి సావిత్రి పేరున రూ 9 లక్షలు, బోయి అప్పల నరసమ్మ పేరున రూ.9లక్షలు, బోయ సత్యం పేరున రూ.9లక్షలు, కొయ్య బంగారయ్య పేరున రూ.10 లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని మిగతా సొమ్మును విడతలవారీగా అప్పుడప్పుడు తన ఖాతాలో నుంచి కాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకుని బ్యాంకుకు వెళ్లి తీసుకున్నారని ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఆమె కోరుతుంది.