ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా ప్రజలు చాలా రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.అందులో ముఖ్యమైనది గుండెపోటు అని కచ్చితంగా చెప్పవచ్చు.
చిన్న, పెద్ద అని తేడా లేకుండా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిపోయిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎంత ఆరోగ్యం గా ఉన్నప్పటికీ గుండె సమస్యలు( Heart problems ) రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
పెద్ద పెద్ద సెలబ్రిటీ లా దగ్గర నుంచి చిన్న వయస్సు ఉన్నవారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు.గుండెపోటుకు చాలా రకాల కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అతిగా తినడం, పొగ త్రాగడం, మద్యం సేవించడం, సరైన నిద్ర లేకపోవడం, రోజు ఒకే చోట కూర్చుని పని చేయడం, ఆందోళనకు గురవడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాయామం చేయకపోవడం, అలాగే జంక్ ఫుడ్ తినడం లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.గతంలో కేవలం 50 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఎక్కువగా గుండెపోటు( Heart attack ) సమస్యలు వస్తూ ఉండేవి.కానీ ప్రస్తుత సమాజంలో 20 నుంచి 40 సంవత్సరాల వయసు గల వారిలో గుండెపోటు సమస్య ఎక్కువగా ఉంది.

ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే అర్జున చెట్టు బెరడును కనుక ప్రతిరోజు తీసుకుంటే కచ్చితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఈ అర్జున చెట్టు( Arjun tree ) బెరడు ఆయుర్వేద షాపులలో ఎక్కువగా లభిస్తుంది.ఇక ఈ అర్జున చెట్టు బెరడు లేదా పొడిని ఒక గ్లాసు పాలలో వేసి బాగా మరిగించాలి.
ఆ తర్వాత ఈ నీటిని తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.ఇంకా చెప్పాలంటే రాత్రంతా ఈ పొడి లేదా బెరడును నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం కూడా తాగవచ్చు.
ఈ విధంగా అర్జున చెట్టు బెరడును తీసుకోవడం వల్ల గుండె సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.అలాగే ఇది కేవలం గుండె సమస్యలకే కాకుండా రక్తపోటును కూడా దూరం చేస్తుంది.