ముంబైలో పరుగులు పెడుతున్న శ్రీవల్లి.. కెరీర్ ప్లానింగ్ అదుర్స్!

సినీ ప్రపంచం ఎంత రంగులు ఉంటుందో.అంత కష్టం కూడా దాగి ఉంటుంది.

 Rashmika Mandanna Perfect Planning For Career, Rashmika Mandanna, Varasudu, Vija-TeluguStop.com

ఈ పోటీ ప్రపంచంలో ఒక నటుడు కానీ నటి కానీ సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ను కొనసాగించాలంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చాలా అవసరం.మరి అలాంటి మాస్టర్ ప్లాన్ తో రష్మిక మందన్న తన కెరీర్ ను ఫుల్ స్పీడ్ గా లాగించేస్తుంది.

ఈమెను చూసి అంతా నేర్చుకోవాలి అనేలా తన ప్లానింగ్ అమలు పరుస్తుంది.

కన్నడ సినిమా కిరాక్ పార్టీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ నుండి తెలుగులో ఛలో సినిమాతో అక్కడ అడుగు పెట్టింది.

ఆ తర్వాత ఈమె నటనకు వరుస అవకాశాలు వరించాయి.అప్పటి నుండి రష్మిక వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.

అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.ఇప్పుడు ఈమె అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

ప్రెసెంట్ రష్మిక చేతిలో మిషన్ మజ్ను, గుడ్ బై, తో పాటు తెలుగులో పుష్ప 2, వంశీ పైడిపల్లి, విజయ్ సినిమా ఉన్నాయి.

Telugu Allu Arjun, Animal, Goodbye, Majnu, Pushpa, Varasudu-Movie

అలాగే దుల్కర్ సల్మాన్ సీతా రామం లో అతిథి పాత్రలో నటించి మెప్పించింది.నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగ ఈమె పాత్రకు మంచి మార్కులు వచ్చాయి.ఇప్పటికే మిషన్ మజ్ను లో తన షూట్ పూర్తి చేసుకుంది.

ప్రెజెంట్ యానిమల్ సినిమా షూట్ లో పాల్గొంటుంది.ముంబైలో ఈ షూటింగ్ చేస్తూనే గుడ్ బాయ్ కోసం డబ్బింగ్ కూడా చెబుతుంది.

ఈ సినిమాల కోసం ఈమె ముంబై లోనే నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది.

Telugu Allu Arjun, Animal, Goodbye, Majnu, Pushpa, Varasudu-Movie

యానిమల్ షూట్ ఒకవైపు.గుడ్ బాయ్ డబ్బింగ్ ఒకవైపు.ఇక విజయ్ వారసుడు షూట్ మరోవైపు.

ఇవి పూర్తి అయ్యే సమయానికి పుష్ప 2 షూట్.ఇలా ఈమె వరుస పనులతో తన డేట్స్ ను మ్యానేజ్ చేసుకుంటుంది.

సౌత్ లో నటిస్తూనే హిందీలో వరుస సినిమాలు చేయడానికి ఈ అమ్మడు ప్లానింగ్ చేసుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube