నటుడు సాయికిరణ్ హీరోయిన్ లయకు పెళ్లి చేయాలనుకున్నారా.. ఆ కారణంతోనే ఆగిపోయిందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు సాయికిరణ్ ( Sai Kiran ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

 Latest New About Guppedantha Manasu Fame Actor Sai Kiran, Sai Kiran, Tollywood,-TeluguStop.com

అయితే కొంతకాలం తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి సాయికిరణ్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.గుప్పెడంత మనసు( Guppedantha Manasu ) సీరియల్ లో మహేంద్ర పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు.

ఇలా పలు సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి సాయికిరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన సినీ కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

ఇకపోతే అప్పట్లో సాయికిరణ్ హీరోయిన్ లయ ( Laya ) కలిసి నటించిన సినిమా ప్రేమించు ( Preminchu ) ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా ద్వారా వీరిద్దరి జోడికి ఎంతోమంది అభిమానులు కూడా పెరిగిపోయారు.

అనంతరం వీరిద్దరి గురించి అప్పట్లో ఎన్నో రకాల వార్తలు కూడా వైరల్ అయ్యాయి.లయ సాయి కిరణ్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Telugu Laya, Sai Kiran, Tollywood-Movie

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సాయికిరణ్ కు ఇదే ప్రశ్న ఎదురయింది.అప్పట్లో మీ గురించి లయ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.అసలు నిజంగానే మీరు తనని ప్రేమించారా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సాయి కిరణ్ సమాధానం చెబుతూ… నేను లయను ప్రేమించలేదు కానీ పెళ్లయితే చేసుకోవాలనుకున్నామని సాయికిరణ్ తెలిపారు.

సినిమాలో మా ఇద్దరి జోడి చూసి చాలా బాగుంది నిజ జీవితంలో కూడా ఒక్కటైతే బాగుంటుందని మా పేరెంట్స్ భావించారు.ఇక వాళ్లు కూడా అలా అనుకోవడంతో అందుకు మేము కూడా ఒప్పుకున్నామని కాకపోతే జాతకాలు కలవకపోవడం వల్ల పెళ్లి చేసుకోలేదని తెలిపారు.

Telugu Laya, Sai Kiran, Tollywood-Movie

మా ఇద్దరి జాతకాలు కలవకపోవడంతోనే పెళ్లి క్యాన్సిల్ అయిందని ఈ సందర్భంగా సాయికిరణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక తాను జాతకాలను బాగా నమ్ముతానని సాయికిరణ్ తెలిపారు.ఇలాంటి వాటిని నేను కూడా నమ్మేవాడిని కాదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను జాతకాలను నమ్మాల్సి వచ్చిందని ఇప్పటికీ జాతకాలను తాను బాగా నమ్ముతానని తాను పరమశివ భక్తుడని సాయికిరణ్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఇలా జాతకాలు కలవని కారణంగానే లయ సాయి కిరణ్ లవివాహం ఆగిపోయిందని, లేకపోతే వీరిద్దరు కూడా సెలబ్రిటీ కపుల్స్ గా ఉండే వారిని చెప్పాలి.

ప్రస్తుతం లయ డాక్టర్ ను వివాహం చేసుకొని విదేశాలలో స్థిరపడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube