హైదరాబాద్, 12 సెప్టెంబర్: ఆహా ఎప్పుడు కూడా విన్నూత్నంగా ఉండే కథలని, షోస్ ని వారి అభిమానులకు ఇవ్వడానికి పరితపిస్తుంది.తెలుగు ఇండియన్ ఐడల్ సక్సెస్ తర్వాత మరోసారి నాన్-ఫిక్షన్ లో తన సత్తాచాటుకోవడానికి డాన్స్ ఐకాన్ తో సిద్ధంగా ఉంది.
ఇప్పటికే షో మేకర్స్ ఎంతో మంది సెలబ్రిటీస్ ని ఈ షో కి బ్రాండ్ అంబాసిడర్ లా ఆహ్వానించారు.ఇప్పుడు అందరిని ఉర్రూతలూగించడానికి లేడీ సూపర్ స్టార్ రమ్య కృష్ణన్ ను జడ్జ్ గా పరిచయం చేయబోతున్నారు.
ఈ షో ద్వారా రమ్య కృష్ణన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో జడ్జ్ గా అడుగుపెడుతున్నారు.ఈ డాన్స్ ఐకాన్ ద్వారా జడ్జి గా ఓ టి టి లో రమ్య కృష్ణన్ అరంగేట్రం చేయబోతున్నారు.
వారితో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ డిజిటల్ స్పేస్ లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా పరిచయం అయ్యారు.టెలివిజన్ టాప్ యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ ఈ షో తో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టారు.
ఈ కార్యక్రమం సెప్టెంబర్ 11న ప్రీమియర్ ఆహ లో ప్రీమియర్ అయింది.అలాగే సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం చేయబడుతుంది.
ఓ టి టి లో న్యాయనిర్ణేతగా తన అరంగేట్రం గురించి రమ్య కృష్ణన్ మాట్లాడుతూ, “డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం నేను సంతోషిస్తున్నాను.ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది.
ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్య ని అందరు చూడబోతున్నారు.అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.”ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ, “డ్యాన్స్ ఐకాన్‌తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము.రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్.
డ్యాన్స్‌పై ఆమెకున్న అవగాహన అసమానమైనది.డాన్స్ ఐకాన్ కు జడ్జి గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.”ఓంకార్, షో యాంకర్ మరియు ప్రొడ్యూసర్ మాట్లాడుతూ, “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది.రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ మరియు ఓక్ టీం ద్వారా సాకరమవడం సంతోషంగా ఉంది.
డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది.”డాన్స్ ఐకాన్ ఎపిసోడ్ ని సెప్టెంబర్ 17 నుండి ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు ఆహ లో తప్పక వీక్షించండి.