వలస కార్మికులకు ఉపాదిని అందించే అరబ్బు దేశాలలో కువైట్ ది ప్రత్యేకమైన స్థానం.ఎంతో మంది వలస కార్మికులు కువైట్ వెళ్లేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.
ముఖ్యంగా భారత్ నుంచీ కువైట్ వెళ్ళే వారి సంఖ్య కూడా ఎక్కువే.కువైట్ ఎప్పటికప్పుడు తన దేశాన్ని అభివృద్ధి పరుచుకునే క్రమంలో ఎన్నో కటినమైన నియమనిభందనలు విధిస్తూ ఉంటుంది.
కువైట్ లో పనిచేసే వలస వాసుల కనీస వయసు 60 ఏళ్ళు మించి ఉంటే వారు కువైట్ లో ఉండాలంటే కొన్ని ప్రత్యేకతలు ఉండేలా చట్టాలని కూడా తీసుకువచ్చింది.
అలాగే పెట్టుబడి దారులను ఆకర్షించేలా, పర్యాటకులను తమవైపుకు తిప్పుకునేలా వీసా నిభంధనల్లో సంచలన మార్పులు కూడా తీసుకువచ్చింది.
అయితే ఇదే క్రమంలో కువైట్ వీసా నిభంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏ మాత్రం ఆలోచన చేయదు.తాజాగా కువైట్ విదేశీ స్పాన్సర్ల విషయంలో కొన్ని కటైనమైన నిభందనలు విధించింది.
స్పాన్సర్ల కారణంగా కువైట్ వచ్చే పర్యాటకులు చేస్తున్న తప్పులకు గాను ఇకపై స్పాన్సర్లె భాద్యత వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు.
విజిట్ వీసాపై కువైట్ వచ్చిన వారు తిరిగి వెళ్ళాక పోవడంపై తీవ్రంగా పరిగణించిన కువైట్ ఇకపై అలాంటి వారిని ఎరేయడమే కాకుండా వారు ఏ స్పాన్సర్ల ద్వారా వచ్చారో తెలుసుకుని వారిపై చర్యలను చేపట్టేలా చట్టాలని రూపొందిస్తోంది.గడిచిన మూడేళ్ళ కాలంగా విజిట్ వీసాపై సుమారు 14,653 మంది కువైట్ వచ్చారని వారి గడువు ముగిసిన తరువాత కూడా ఇంకా కువైట్ లోనే ఉన్నారని ఇది కువైట్ చట్టాలకు వ్యతిరేకమని వీరందరూ ఏ స్పాన్సర్ల ద్వారా కువైట్ వచ్చారో ఆయా స్పాన్సర్లకు భారీ జరిమానాలు విధించడానికి సిద్దమయ్యింది.
అంతేనా ఇలాంటి స్పాన్సర్ల కు రెండేళ్ళ పాటు ఫ్యామిలీ విజిట్ వీసాలతో పాటు మరే ఇతర వీసాలను ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది.ఈ విషయంపై ఉన్నత అధికారులు కసరత్తులు చేస్తున్నారని త్వరలో అధికారిక ఉత్తరువుల ద్వారా ఈ విషయం వెల్లడిస్తారని తెలుస్తోంది.