బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సూచించారు.
ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని, ఈ వేడుకల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.భారత సమాఖ్యలో తెలంగాణ విలీనమైన రోజును రాష్ట్రంలోని ప్రజలందరూ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు అవుతారని ఆయన వెల్లడించారు.మరోవైపు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కేంద్రంలోని బీజేపీ కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.