తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలో తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు కూడా తీసుకుంటారు.
ఈ రీతిగానే తాజాగా హైదరాబాద్ గోల్డెన్ సిటీ కాలనీలో ఐదేళ్లుగా తాగునీటి సమస్య ఉంది అంటూ ఓ బాలుడు చేసిన ట్విట్ పై కేటీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు.ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని జలమండలి ఎండి దాన కిషోర్ కి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
దీంతో కేటీఆర్ ఆదేశాలతో అక్కడికి వెళ్లినా కిషోర్… బాలుడు ఉమర్ నీ కలవటం జరిగింది.ఈ ప్రాంతం వాటర్ పైప్ లైన్ కోసం ₹2.94 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.అయితే ఇటీవల వర్షాలు పడటం వల్ల పనులు స్టార్ట్ కాలేదని.
త్వరలోనే పనులు ప్రారంభించి రెండు వారాల్లోగా తాగునీటి సరఫరా సమస్య పరిష్కరిస్తామని ఆ ప్రాంత ప్రజలకు తెలియజేశారు. చిల్డ్రన్స్ డే నాడు బాలుడు పెట్టిన ట్విట్ కి కేటీఆర్ స్పందించి సమస్య పరిష్కారానికి బాధ్యత తీసుకోవటం పట్ల నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.