బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో కృతి సనన్ ఒకరు.ఈమె ప్రెజెంట్ వరుణ్ ధావన్ తో కలిసి నటించిన భేదియా సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా ఉంది.
ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈమె నటించిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కృతి సనన్ టాలీవుడ్ లోకి మహేష్ 1 నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఇది హిట్ అవ్వక పోవడంతో ఈమెకు ఇక్కడ మళ్ళీ అవకాశాలు రాలేదు.అయితే ఈమె ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది.దీంతో ఈమె పేరు మారుమోగి పోయింది.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరిలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా దాదాపు 6 నెలల వాయిదా వేసాడు.
టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.

లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.ఇటీవలే టీజర్ రిలీజ్ అవ్వగా భారీ ట్రోలింగ్ చేసారు.ఓం రౌత్ అన్ని పాత్రలను మార్చేసి చూపించారని ఆరోపించారు.దీంతో టీమ్ రీషూట్ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

”ఈ సినిమా విషయంలో నేను మాత్రమే కాదు టీమ్ మొత్తం కూడా ఎంతో గర్వంగా ఉన్నాము.అయితే కేవలం టీజర్ తోనే సినిమా మొత్తాన్ని అంచనా వేయకూడదు.సినిమాను చాలా గ్రాండ్ విజువల్స్ తో పవర్ ఫుల్ గా ఓం రౌత్ ప్లాన్ చేసాడని..ఇప్పుడు కూడా ఇంకా బెటర్ గా చూపించడం కోసమే వర్క్ చేస్తున్నారని” తెలిపింది.ఈమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.