టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్దీ రోజులుగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న విషయం తెలిసిందే.రెండు మూడు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత ఇటీవలే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇది ఇలా ఉంటే సమంత నటించిన తాజా చిత్రం యశోద.ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేకపోయింది సమంత.
అయితే ఈ సినిమా విడుదల అయిన తర్వాత అందులో సమంత అనారోగ్య సమస్యతోనే ఏ విధంగా ఆ యాక్షన్ సీన్స్ ను చేసింది అన్నది చర్చనీయాంశంగా మారింది.
సమంతకి ఉన్న డెడికేషన్ హార్డ్ వర్క్ ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.
ఇక ఆమె డబ్బింగ్ కూడా హాస్పిటల్ లో నుంచి చెప్పడం విశేషం.సమంతకు శరీరం సహకరించకపోయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక వీడియో ఇంటర్వ్యూ కూడా చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే కేవలం సమంత మాత్రమే కాకుండా సమంత తో పాటు మరొక నటి కూడా ఈ విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.మరి ఆ నటి ఎవరు ఆమె ఎటువంటి సమస్యలతో బాధపడుతోంది అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సినీ నటి కల్పిక గణేష్ గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె చాలా వరకు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్స్ లో కనిపించింది.తాజాగా విడుదలైన యశోద సినిమాలో కూడా కల్పిక నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా యశోద సినిమాకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కల్పిక సమంత మాదిరిగానే తాను కూడా మయో సైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.
అయితే తనది ఫస్ట్ స్టేజ్ కాగా,సమంతది మూడో స్టేజ్ అని చెప్పుకొచ్చింది.అయితే ఆ సమస్య గురించి సమంతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు నటి కల్పిక తెలిపింది.ఇది ఇలా ఉంటే నటి కల్పిక ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తాను ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటుంది.







