సినిమా ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమయ్యే హీరోయిన్లు తొలి సినిమా రిజల్ట్ ను బట్టే కొత్త సినిమా ఆఫర్లను అందిపుచ్చుకోవడం జరుగుతుంది.ఉప్పెన మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టికి బేబమ్మ పాత్ర ఎంతో మంచి పేరును, గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ బిజీ కానంతగా వరుస సినిమా ఆఫర్లతో కృతిశెట్టి బిజీ అవుతున్నారు.తొలి సినిమా విడుదల కాకముందే నానికి జోడీగా కృతిశెట్టికి మూవీ ఆఫర్ వచ్చింది.
అయితే ఈ యంగ్ హీరోయిన్ తన ఫేవరెట్ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అని చెబుతుండటం గమనార్హం.ఉప్పెనలా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న ఈ హీరోయిన్ నానితో పాటుస్ సుధీర్ బాబు సినిమా, రామ్ సినిమాలలో నటిస్తున్నారు.
ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఒక్క సినిమా హిట్ అయినా కృతిశెట్టికి సినిమా ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.అయితే ఒక ఇంటర్వ్యూలో కృతిశెట్టి మాట్లాడుతూ ఉప్పెన షూటింగ్ కు ముందు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే కృతిశెట్టిని కొన్ని తెలుగు సినిమాలను చూడమని సూచనలు చేశారట.ఆ సమయంలో కృతి తాను రంగస్థలం సినిమాను చూశానని ఆ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చారు.రంగస్థలం మూవీలో చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత తాను చరణ్ కు ఫ్యాన్ అయ్యానని కృతిశెట్టి వెల్లడించారు.
చరణ్ తో ఒక సినిమాలో నటించాలనేది తన కోరిక అని కృతిశెట్టి చెప్పుకొచ్చారు.
అయితే చరణ్ కృతిశెట్టి కోరికను తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది.చరణ్, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ లకు జోడీగా నటిస్తే మాత్రం కృతిశెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకుకునే అవకాశం ఉంటుంది.