ఈనెల 9వ తేదీ నుండి అసని తూఫాను ఉధృతికి గల్లంతు అయిన బోటు.జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్.
ఈరోజు మాలకాయలంక సమీపంలో బోటును గుర్తించి గిలకలదిండి హార్బర్ వద్ద ఒడ్డుకు చేర్చిన కృష్ణా జిల్లా పోలీసులు.నిషిద్ధ సమయంలో చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటాం – జిల్లా ఎస్పీ.
ఈ నెల 8 వ తేదీ రాత్రి 8 గంటల సమయానికి మచిలీపట్నానికి చెందిన షేక్ మహమ్మద్ అలీ చెందిన IND AP K2 MO 795 నెంబరు గల బోటును కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామానికి చెందిన సంగడి రాంబాబు అనే మత్స్యకారుడు అతనితో పాటు మరో 7 గురు మత్స్యకారులను వెంట పెట్టుకొని గిలకలదిండి నుండి చేపల వేట నిమిత్తం వెళ్ళినారు.అసని తూఫాను ఉధృతి కారణంగా ది 09.05.2022 తేదీ నుండి సదరు బోటు గల్లంతు అయిందని సమాచారం రాగా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, బందరు డీఎస్పీ శ్రీ మాసూం బాషా గారి పర్యవేక్షణలో కృష్ణా జిల్లా పోలీస్, మెరైన్ పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, కోస్ట్ గార్డు మరియు ఇతర శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలుగా విభజించి గాలింపు చర్యలు చేపట్టి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాలకాయలంక సమీపంలో వారి ఆచూకీ కనిబెట్టి సురక్షితంగా వారిని గిలకలదిండి హార్బర్ వద్దకు ఒడ్డుకు చేర్చడం జరిగింది.