గూగుల్ ట్రాన్స్‌లేట్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఏ ప్రదేశానికి వెళ్ళినా గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయంతో మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు.
ఇంకా ఎన్నో కమ్యూనికేషన్ ఫీచర్లను గూగుల్ ట్రాన్స్‌లేట్ యూజర్లకు ఆఫర్ చేస్తోంది.ఇది వందకు పైగా భాషలను ట్రాన్స్‌లేట్ చేస్తూ చాలా మందికి ఉపయోగపడుతోంది.
ఇప్పుడు దీని సేవలను మరింత మంది ప్రజలకు విస్తరించేందుకు గూగుల్ నడుంబిగించింది.
గూగుల్ ట్రాన్స్‌లేట్ తాజాగా సంస్కృతం ట్రాన్స్‌లేట్‌కు సపోర్ట్ ప్రకటించింది.
దీంతో సంస్కృతం ప్రియులు ఇతర భాషల సమాచారాన్ని సంస్కృతంలోకి, సంస్కృతం భాష లో ఉన్న సమాచారాన్ని ఇతర భాషల్లోకి అనువదించడం సాధ్యమవుతుంది.సంస్కృతంతో సహా కొత్తగా 8 ఇండియన్ లాంగ్వేజెస్ ట్రాన్స్‌లేట్‌కు జోడించినట్లు గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇతర దేశాలకు చెందిన మరో 16 భాషలను కూడా తమ ట్రాన్స్‌లేట్‌లో గూగుల్ యాడ్ చేసింది.మొత్తంగా కొత్తగా 24 భాషలు జత కావడంతో గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు ఏకంగా 133 భాషలకు సపోర్ట్ చేస్తుంది.
ఈ 24 లాంగ్వేజెస్ వరల్డ్ వైడ్ గా 30కోట్ల మంది మాట్లాడుతున్నారని గూగుల్ తెలిపింది.
ట్రాన్స్‌లేట్‌లో సాంస్క్రిట్ లాంగ్వేజ్ కూడా జోడించాలని చాలా రోజులుగా గూగుల్‌కు కఅభ్యర్థనలు అందుతున్నాయట.యూజర్ల అభ్యర్థన మేరకు గూగుల్ సంస్కృత యాడ్ చేసేసింది.భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో మాట్లాడే భాషలను కూడా యాడ్ చేయనున్నట్టు గూగుల్ తెలిపింది.
సంస్కృతం, అసామీ, మణిపురి, భోజ్‌పురి, డోగ్రీ, కొంకణి, మైథిలి, మిజో భాషలకు గూగుల్ ట్రాన్స్‌లేట్ సపోర్ట్ చేయనుంది.అయితే ఈ ప్రకటన ఆల్రెడీ వచ్చింది కానీ సంస్కృతం తో సహా ఈ కొత్త భాషలు ట్రాన్స్‌లేట్‌లో జత కావాలంటే మరికొద్ది రోజులు పట్టొచ్చు.
ఆ తర్వాత గూగుల్ మొత్తంగా 19 భారతీయ భాషలను ట్రాన్స్‌లేట్ చేసినట్లవుతుంది.