త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప డైరెక్టర్ ఏమి కాదంటూ కోట శ్రీనివాస రావు షాకింగ్ కామెంట్స్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో SV రంగారావు లాంటి నటుడు మళ్ళీ పుట్టడేమో అని అనుకున్నారు అందరూ.కానీ ఆయన ఆత్మ కోట శ్రీనివాసరావు( Kota Srinivasa Rao ) గారిలో ఆవహించిందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఆయన నటన చూస్తూ ఉంటే.

 Kota Srinivasa Rao Shocking Comments About Director Trivikram Srinivas Details,-TeluguStop.com

విలనిజం కానీ , కామెడీ కానీ , సెంటిమెంట్ కానీ నటన లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయో,అన్నీ యాంగిల్స్ లో అద్భుతంగా నటించే టాలెంట్ ఆయనకీ మాత్రమే సొంతం.ఎలాంటి పాత్రలో అయిన ఆయన నటించడు, కేవలం జీవిస్తాడు.

ఇప్పుడంటే ఆరోగ్యం బాగాలేక సినిమాలు చెయ్యడం బాగా తగ్గించేసాడు కానీ, ఆయన ఇండస్ట్రీ లో కనిపించని లోటు స్పష్టం గా తెలుస్తుంది.వెండితెర పై ఏదైనా తండ్రి పాత్ర చూసినప్పుడు ఈ పాత్ర కోటా శ్రీనివాస రావు చేసి ఉంటే ఇంకా అదిరిపోయేది కదా అని అనిపిస్తాది.

జనాల హృదయాల్లో ఆయన వేసిన చెరగని ముద్ర అలాంటిది మరి.అయితే కోటా శ్రీనివాస రావు నటన పరంగా ఆయనని ఎంతలా అభిమానిస్తారో, ఆయన ఇచ్చే కొన్ని ఇంటర్వ్యూస్ లో చేసే కొన్ని కామెంట్స్ మాత్రం కాంట్రవర్సీ కి దారి తీస్తుంటాయి.

Telugu Rajamouli, Kotasrinivasa-Movie

గత కొంతకాలం క్రితం ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మీకు నేటి తరం దర్శకులలో బాగా ఇష్టమైన దర్శకుడు ఎవరు అని అడగగా దానికి కోటా శ్రీనివాస రావు సమాధానం చెప్తూ ‘ మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింప చేసి తెలుగోడి మీసం మెలి వేసేలా చేసిన రాజమౌళి( Rajamouli ) అంటే నాకు చాలా ఇష్టం.ఆయన సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు ప్రపంచం లో ఎవ్వరూ తియ్యలేరు.కొన్ని షాట్స్ చూసినప్పుడు అయితే అసలు ఈయనకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి.? , ఆలోచనలు రావడం ఒక ఎత్తు అయితే దానిని అనుకున్నది అనుకున్నట్టు వెండితెర మీద చూపించడం మరో ఆర్ట్.అందులో రాజమౌళిని ఢీ కొట్టే దర్శకులు ఇండియా లోనే లేరు’ అని చెప్పుకొచ్చాడు.కోటా శ్రీనివాస రావు రాజమౌళి తో ఇప్పటి వరకు సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1 మరియు ఛత్రపతి వంటి సినిమాలు చేసాడు.

Telugu Rajamouli, Kotasrinivasa-Movie

ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్( Director Trivikram ) గురించి మీ ఉద్దేశ్యం ఏమిటి అని కోటా శ్రీనివాస రావు ని అడగగా ‘ నేను అతను రచించిన సినిమాల్లో చేశాను, దర్శకత్వం వహించిన సినిమాల్లో చేశాను.నేటి తరం దర్శకులలో నేను ఎక్కువగా నటించింది ఆయన సినిమాల్లోనే.ఇన్ని ఏళ్ళ మా సుదీర్ఘ పరిచయం లో నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే,త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక గొప్ప డైలాగ్ రైటర్, ఆయన కలం నుండి వచ్చే ప్రతీ అక్షరం మనల్ని నవ్విస్తుంది, బాధపెడుతోంది మరియు ఆలోచింపచేస్తుంది.కానీ ఆయన రచనని నేను ఎక్కువ ఇష్టపడతాను అనో ఏమో తెలియదు కానీ,ఆయన రచన పోల్చి చూస్తే దర్శకత్వం చాలా మామూలుగానే అనిపిస్తుంది.

గొప్ప దర్శకుడు ఏమి కాదు’ అంటూ వ్యాఖ్యానించాడు.ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో అప్పట్లో తెగ వైరల్ గా మారాయి.తన మనసులో ఉన్నది ఎలాంటి భేదభావం లేకుండా బయటపెట్టగల మనస్తత్వం ఉన్న కోటా శ్రీనివాస రావు అంటే ఇప్పటికే అదే రేంజ్ గౌరవిస్తారు టాలీవుడ్ సెలెబ్రిటీలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube