కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ కు చెక్ పెట్టనున్నారా..? అసలు వ్యూహం ఎంటి..?

కాంగ్రెస్ రాజకీయాల్లో.ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు ఎప్పుడు తిరుగుబాటు జెండాలు ఎగురవేస్తూ నే ఉంటారు.

 Komati Reddy Venkat Reddy.. Will You Give A Check To Revanth What Is The Origina-TeluguStop.com

అదే కోవకు చెందిన నేతలే కోమటి రెడ్డి బ్రదర్స్.ఇందులో రాజగోపాల్ రెడ్డి అయితే.తన పార్టీ కి రాజీనామా చేసి.బీజేపీ లో చేరారు.తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో.10 వేల ఓట్లతో.ఓడిపోయారు.నిజానికి అది ఓటమి కాక పోయినా టెక్నికల్ గా అది ఓటమే అవుతుంది.సీఎం కెసిఆర్ తన అంగ బలాన్ని, అర్థ బలాన్ని, దానా బలాన్ని పోగేసి ఎన్నికలకు పోయారు.రాష్ట్రం లోని ప్రతి నేతను ఒక గ్రామానికి ఇంచార్జీ గా నియమించడం మాత్రమే కాకుండా.

తాను కుడా ఒక గ్రామానికి ఇంచార్జీ గా బాధ్యతలు తీసుకున్నారు.అలా మునుగోడు రాజగోపాల్ రెడ్డి నీ కెసిఆర్ పథకం ప్రకారం ఓడించాడు.

దాంతో ఆయన సైలెంట్ అయ్యారు.

ఇక నల్లగొండ జిల్లాలో మంచి పేరున్న మరో నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

అయన భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి గెలిచి.కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతూ ఉన్నారు.

అయితే అయన రేవంత్ రెడ్డీ కి పగ్గాలు వచ్చిన దగ్గరి నుంచి అసంతృప్తి తో ఉన్నారు.స్టార్ క్యాంపెయిన్ గా బాధ్యతలు ఇచ్చినా వాటిని పట్టించు కాలేదు.

అధిష్టానం వద్ద తను అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని బిస్మించుకు కూర్చున్నారు.

Telugu Cm Kcr, Cheef, Congress, Komati Reddy, Komatireddy, Nallagonda, Rajagopal

అందులో భాగంగా చాలా కాలం నుంచి ఆయన అంటి ముట్ట నట్టు పార్టీ కి దూరంగా ఉంటున్నారు.ఇక రాష్ట్రానికి కొత్త ఇంచార్జీ వచ్చిన కలవలేదు.చివరికి ఆయనే ఫోన్ చేసి పిలవడం తో.వెళ్ళి కలిశారు.ఇక బయటకు వచ్చిన తర్వాత అయన రేవంత్ వర్గం పై విరుచుకు పడ్డారు.

ఆరు సార్లు ఓడిన పక్కన కూర్చొను అని తెగేసి చెప్పారు.అధిష్టానానికి తన అంతర్గతం గట్టిగానే చెప్పినట్టు అయన మాటల్లో తెలుస్తోంది.

ఎలాగైనా రేవంత్ ను తప్పించి తనకు బాధ్యతలు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చైనట్టు కూడా తెలుస్తోంది.

Telugu Cm Kcr, Cheef, Congress, Komati Reddy, Komatireddy, Nallagonda, Rajagopal

మరో వైపు సీనియర్లు అందరినీ ఏకం చేసి.పొమ్మన లేక రేవంత్ కు పొగ పెట్టాలి అని చూస్తూ ఉన్నారు.రేవంత్ ఒకవేల కొత్త పార్టీ పెడితే.

అప్పుడు కాంగ్రెస్ పగ్గాలు తీసుకొని సీఎం కావాలని కలలు కంటున్నారు.ఎన్నో ఏళ్లుగా అటు సెంట్రల్ మినిస్టర్ పదవి, ఇటు సీఎం పదవి కోమటి రెడ్డీ బ్రదర్స్ నీ ఊరిస్తూ ఉన్నాయి.

ఈ సారి కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వక పోతే బీజేపీ లో చేరి కేంద్ర మంత్రి కావాలని చూస్తున్నారు.మరి కోమటి రెడ్డీ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube